భారత్-బ్రిటన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ నేపథ్యంలో స్కాచ్ విస్కీ ధరలు తగ్గే అవకాశముంది. ప్రస్తుతం 150% ఉన్న దిగుమతి సుంకాన్ని మొదట 75%కి, తర్వాత 10 ఏళ్లలో 40% వరకు తగ్గించనున్నారు. దీనితో స్కాచ్ విస్కీ మరింత సులభంగా లభించనుంది. ఈ నెలలో లండన్‌లో జరగనున్న భేటీలో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరగనున్నది. ట్రేడ్ ఒప్పందం విప్లవాత్మక మార్పు తెస్తుందని స్కాచ్ విస్కీ అసోసియేషన్ పేర్కొంది.