TG: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో ఐదుగురు మత్స్యకారులను NDRF సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఇదే చెరువులో గల్లంతైన 11 మందిలో 10 SDRF సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. ఒడ్డుకుచేరిన సిబ్బందిని సత్తుపల్లి ఆస్పత్రికి తరలించారు. మరొకరి కోసం గాలింపు కొనసాగుతోంది. పరిస్థితిని పర్యవేక్షిస్తున్న కలెక్టర్ దివాకర్, ఎమ్మెల్యే రాగమయి దయానంద్ ఎప్పటికప్పుడూ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటికి సమాచారం చేరవేస్తున్నారు.