AP: అర్నబ్ తుపాను కారణంగా విశాఖపట్నం తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుండటంతో పాటు సముద్రం దాదాపు 10 మీటర్ల మేర ముందుకు చొచ్చుకొచ్చింది. దీనివల్ల ప్రమాదకర పరిస్థితులు నెలకొనడంతో, అధికారులు అప్రమత్తమై పర్యాటకుల ప్రవేశంపై కఠినమైన ఆంక్షలు విధించారు. ముఖ్యంగా రుషికొండ, ఆర్కే బీచ్‌లను అధికారులు మూసివేశారు. తుపాను తీవ్రత దృష్ట్యా ప్రజలు బీచ్‌లకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.