ఎన్‌ఎస్‌ఈ ఐపీవోకు సెబీ గ్రీన్ సిగ్నల్

దశాబ్దకాలంగా వాయిదా పడుతున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) పబ్లిక్ ఇష్యూకి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్‌వోసీ) జారీ చేసింది. ఈ అనుమతి సంస్థ ప్రయాణంలో కీలక మైలురాయి అని ఎన్‌ఎస్‌ఈ చైర్‌పర్సన్ శ్రీనివాస్ ఇంజేటి తెలిపారు. భాగస్వాములకు విలువ జోడించేందుకు ఇది తోడ్పడుతుందని చెప్పారు. ఎన్‌వోసీ లభించిన తర్వాత ఇష్యూకి రావడానికి ఏడు నుంచి ఎనిమిది నెలలు పట్టొచ్చని ఎన్‌ఎస్‌ఈ ఎండీ ఆశీష్ కుమార్ చౌహాన్ గతంలో తెలిపారు. సంస్థ ఐపీవో దేశీయంగా అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలుస్తుందనే అంచనాలు నెలకొన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్