మ్యూచువల్ ఫండ్లకు SEBI కీలక ఆదేశాలు: ప్రీ-IPO పెట్టుబడులపై నిషేధం

స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI మ్యూచువల్ ఫండ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై మ్యూచువల్ ఫండ్స్ కేవలం IPO లేదా పబ్లిక్ ఇష్యూ యాంకర్ ఇన్వెస్టర్ భాగంలో మాత్రమే పెట్టుబడి పెట్టాలని స్పష్టం చేసింది. ప్రీ-IPO షేర్ ప్లేస్‌మెంట్‌లలో పెట్టుబడులు పెట్టరాదని తెలిపింది. SEBI మ్యూచువల్ ఫండ్స్ రెగ్యులేషన్స్, 1996 ప్రకారం, జాబితా చేయబడిన లేదా జాబితా చేయబడే అవకాశం ఉన్న సెక్యూరిటీలలో మాత్రమే పెట్టుబడులు చేయాలని పేర్కొంది.

సంబంధిత పోస్ట్