సోమవారం నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు మంగళవారం కూడా అదే బాటలో సాగుతున్నాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (94.61) బలహీనపడడం, ఎల్‌నినో కారణంగా వర్షపాతం లోటు భారీగా ఉంటుందనే అంచనాలు ప్రతికూలంగా మారాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కదలాడుతున్నాయి. ఉదయం 10:00 గంటల సమయంలో సెన్సెక్స్ 170 పాయింట్ల నష్టంతో 76,558 వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల నష్టంతో 23,885 వద్ద కొనసాగుతున్నాయి. అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం 61 పాయింట్ల లాభంతో ఉంది.