తెలంగాణలో 'ఇందిరమ్మ ఇల్లు' పథకం రెండో విడత అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. జూన్ 1న ఆసిఫాబాద్ జిల్లా కెరమరి మండలం కొఠారి గ్రామంలో సీఎం రేవంత్ రెండో విడత ఇళ్ల మంజూరును ప్రారంభించనున్నారు. ఈ దశలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.50 లక్షల ఇళ్లను, ప్రతి నియోజకవర్గానికి 2,000 చొప్పున మంజూరు చేయనున్నారు. తొలి విడతలో 4.50 లక్షల ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటికే లక్ష ఇళ్లు పూర్తయ్యాయి. గృహ నిర్మాణాల్లో పారదర్శకత కోసం జీపీఎస్, ఏఐ సాంకేతికతను వినియోగిస్తూ, ఫిర్యాదుల పరిష్కారానికి టోల్‌ఫ్రీ నంబర్‌ను కూడా ఏర్పాటు చేశారు.