తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ఉత్సాహం క్రమంగా టెన్షన్‌గా మారుతోంది. ప్రచార డప్పులు మోగడం ఆగిపోవడంతో, ఇప్పుడు అభ్యర్థులు, కార్యకర్తలు పోలింగ్ రోజు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 14న రెండో విడత ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రెండో విడత గ్రామ పంచాయతీ పోలింగ్ జరగనుంది.