పశ్చిమ బెంగాల్‌లో బుధవారం నాడు రెండు విడత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 142 స్థానాలకు తుది దశ పోలింగ్ జరుగుతుండగా, కొన్ని చోట్ల విధ్వంసకర సంఘటనలు, స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎంటలీ నియోజకవర్గంలో పోలింగ్ అధికారులు, సెక్యూరిటీ సిబ్బందితో బీజేపీ అభ్యర్థి వాగ్వాదానికి దిగారు. నదియా జిల్లాలోని చాప్రలో ఓ బీజేపీ ఏజెంట్‌పై దాడి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈవీఎంలు మొరాయిస్తున్నాయని, కొన్ని చోట్ల ప్రాపర్టీ డ్యామేజ్ జరిగిందని ఫిర్యాదులున్నాయి.