లాడ్జిలో సీక్రెట్ కెమెరాలు.. ప్రేమ జంటకు బెదిరింపులు

TG: భద్రాచలంలోని శ్రీ రాఘవ రామ రెసిడెన్సీ లాడ్జిలో ఓ ప్రేమ జంటను సిబ్బంది బ్లాక్‌మెయిల్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఇటీవల లాడ్జిలో ఓ ప్రేమ జంట గడిపారు. అయితే, లాడ్జి సిబ్బంది గది లోపల సీక్రెట్ కెమెరాలతో వీడియోలు తీసి, ప్రేమ జంటను బెదిరించి డబ్బులు తీసుకున్నారు. కొద్దిరోజులకు మరోసారి వీడియోలను లీక్ చేస్తామని బెదిరించడంతో ప్రేమికులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి లాడ్జి సిబ్బందిని విచారిస్తున్నారు.

సంబంధిత పోస్ట్