లిఫ్ట్‌లో సెక్యూరిటీ గార్డ్‌పై దాడి (వీడియో)

గ్రేటర్ నోయిడాలోని ఎకో విలేజ్-2 సొసైటీలో పార్కింగ్ వివాదం తీవ్ర రూపుదాల్చింది. నో-పార్కింగ్ జోన్‌లో కారు నిలిపిన నవీన్ పాసవాన్ అనే టెనెంట్‌ను కారు తీయాలని సెక్యూరిటీ గార్డ్ కోరడంతో ఆగ్రహంతో రగిలిపోయిన సదరు వ్యక్తి, లిఫ్ట్ లోపల గార్డ్‌పై పిడిగుద్దులతో దాడికి తెగబడ్డాడు. ఇతర గార్డులు అడ్డుకోవడానికి ప్రయత్నించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డై వైరల్‌గా మారాయి. సెక్యూరిటీ గార్డ్, సొసైటీ మేనేజ్‌మెంట్ ఫిర్యాదుతో బిస్రఖ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕