రబీలో 75 శాతం సబ్సిడీతో సీడ్స్: తుమ్మల

TG: రబీ సాగుకు సంబంధించి శనివారం విత్తన పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రబీలో తక్కువ నీరు, తక్కువ పెట్టుబడి, స్వల్ప కాలవ్యవధిలో అధిక ఆదాయాన్నిచ్చే పంటలకే రైతులు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు. ఈ మేరకు పప్పు ధాన్యాలు, నూనెగింజల విత్తనాల పంపిణీని ఆయన ప్రారంభించారు. రూ.52 కోట్ల ఖర్చుతో కొన్ని విత్తనాలకు 50-75%, మరికొన్నింటికి 100% సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. 21 జిల్లాల్లో 29వేల క్వింటాళ్లకుపైగా పప్పుధాన్యాల విత్తనాల పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు.

సంబంధిత పోస్ట్

✕
✕