రాజా గంగాధరరావు మరణవార్త తెలియగానే బ్రిటిష్ వారు రాణి లక్ష్మీబాయి దత్తపుత్రుడు దామోదర్ రావును ఝాన్సీ వారసుడిగా అంగీకరించడానికి నిరాకరించారు. రాజ్య స్వాధీన విధానంలో భాగంగా ఝాన్సీని బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. లక్ష్మీబాయి లండన్ కోర్టులో వేసిన దావాను న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో లక్ష్మీబాయి ఝాన్సీని రక్షించుకునేందుకు స్వయం సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని బ్రిటిష్ వారిపై యుద్ధం చేసింది.