టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 2017లో భారత జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చినా తాను ఎందుకు తిరస్కరించారో వెల్లడించారు. నాటి కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ కార్యదర్శి అమితాభ్ చౌదరి అడిగినా, తనకు నచ్చిన సపోర్ట్ స్టాఫ్‌ను నియమించుకునే స్వేచ్ఛ లేకపోవడంతో ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సెహ్వాగ్ తెలిపారు. అప్పటికే కోహ్లీ-కుంబ్లే మధ్య విభేదాలు తలెత్తడంతో, కుంబ్లే రాజీనామా అనంతరం ఈ ఆఫర్ వచ్చిందని, అయితే తన షరతులు నెరవేరకపోవడంతో సెహ్వాగ్ ఈ పదవిని వదులుకున్నారు.