TG: రాష్ట్రంలో విత్తన కంపెనీలను కట్టడి చేసేందుకు త్వరలో కొత్త విత్తన చట్టం రాబోతుందని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. తెలంగాణలో మళ్లీ ఆదర్శరైతు వ్యవస్థను తెస్తున్నామని చెప్పారు. వ్యవసాయ అధికారులు ప్రతి గ్రామానికి ఒక ఆదర్శ రైతును త్వరలో ఎంపిక చేయనున్నారని తెలిపారు. వారికి వేతనాలు ఉండవని, గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు వారి ద్వారా అమలు జరుగుతాయని స్పష్టం చేశారు.