శరీరానికి సెలీనియం: ఆరోగ్యానికి ఎంతో అవసరం!

శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగడానికి, శక్తి లభించడానికి విటమిన్లతో పాటు మినరల్స్ కూడా ముఖ్యమైనవే. వీటిలో సెలీనియం ఒకటి. ఇది జీవక్రియలకు, మెటబాలిజం పెంచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, థైరాయిడ్ పనితీరును మెరుగుపరచడానికి, శ్వాసకోశ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్‌గా, యాంటీవైరల్‌గా పనిచేస్తుంది. రోజుకు 70-80 మైక్రోగ్రాముల సెలీనియం అవసరం. ఇది సముద్రపు ఆహారం, నట్స్, సీడ్స్, చికెన్, గుడ్లు, పాలకూర, పుట్టగొడుగులు, వెల్లుల్లి, బ్రోకలీ వంటి అనేక ఆహారాలలో లభిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్