తన తల్లిని పదేళ్ల కిందట తీసుకెళ్లిన కర్ణాటకలోని బసడోణి గ్రామానికి చెందిన బసప్పను, ఈరయ్య (28) అనే యువకుడు సోమవారం రాత్రి మచ్చుకత్తితో 16 సార్లు నరికి దారుణంగా హత్య చేశాడు. బసప్ప, ఈరయ్య తల్లిని మహారాష్ట్రలోని కొల్హాపురానికి తీసుకెళ్లి, అక్కడ వదిలి బసడోణికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న ఈరయ్య, బసప్పను హొలికట్టి ప్రాంతంలో వేచి చూసి హత్య చేశాడు. హత్య అనంతరం పోలీసులకు సమాచారం అందించిన ఈరయ్య, బసప్ప ఛాతీపై కాలు పెట్టి నిలబడి ఫోటో తీసుకున్నాడు.