మానసిక దివ్యాంగుడి నిస్వార్థ ప్రేమ.. వధువుకు అరుదైన బహుమతి

అస్సాంలోని బార్పేటలో జరిగిన ఒక వివాహ వేడుకలో, మనోరంజన్ అనే మానసిక దివ్యాంగుడు తన వద్ద ఉన్న రూ.10 లను వధువుకు కానుకగా ఇచ్చి గొప్ప మానవత్వాన్ని చాటుకున్నాడు. ఖరీదైన బహుమతులు, కట్నకానుకల మధ్య, తన చిరిగిన జేబులోని ఆ కొద్ది మొత్తాన్ని వధువు చేతిలో పెట్టిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిస్వార్థ ప్రేమకు, స్వచ్ఛమైన మనసుకు ఇది నిదర్శనమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. డబ్బు కంటే మనిషిలోని స్వచ్ఛమైన మనసే గొప్పదని పలువురు అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్