కోల్‌కతాలో టీ20 ప్రపంచ కప్ తొలి సెమీఫైనల్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. ఈ కీలక పోరులో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్నర్ బౌలింగ్ ఎంచుకున్నారు. దక్షిణాఫ్రికా జట్టులో డికాక్, మార్‌క్రమ్ (కెప్టెన్), మిల్లర్, కేశవ్ మహరాజ్, రబాడ వంటి ఆటగాళ్లు ఉన్నారు. న్యూజిలాండ్ జట్టులో అలెన్, రచిన్ రవీంద్ర, ఫిలిప్స్, శాంట్నర్ (కెప్టెన్), ఫెర్గూసన్ వంటివారు ఆడనున్నారు.