ఇరాన్‌పై ట్రంప్‌ దూకుడుకు సెనెట్‌ కళ్లెం

ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దూకుడు ప్రవర్తనకు అమెరికా సెనెట్‌ కళ్లెం వేసింది. అధ్యక్షుడి యుద్ధ అధికారాలను పరిమితం చేసే తీర్మానానికి ఆమోదం లభించింది. డెమోక్రటిక్‌ సెనెటర్‌ టిమ్‌ కెయిన్‌ ప్రవేశపెట్టిన ఈ తీర్మానం ప్రకారం, కాంగ్రెస్‌ నుంచి స్పష్టమైన ఆమోదం లభిస్తే తప్ప.. ఇరాన్‌ లోపల లేదా దానికి వ్యతిరేకంగా జరిగే ఘర్షణల్లో యూఎస్‌ దళాలు పాల్గొనకూడదు. డెమోక్రటిక్‌ సెనెట్‌ చక్‌ షుమర్‌ మాట్లాడుతూ, 'ఈ అధ్యక్షుడు నిండుగా తూటాలున్న తుపాకీతో ఆడుకుంటున్న చిన్నపిల్లాడిలా ఉన్నాడు' అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్