సీనియర్ నటుడు శివాజీ రాజా తండ్రి కన్నుమూత

సీనియర్ నటుడు శివాజీ రాజా తండ్రి జి. రామరాజు (85) మంగళవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ మధురానగర్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. వయోభారంతో ఆరోగ్యం క్షీణించడమే మరణానికి కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శివాజీ రాజా తండ్రి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్