రామ్ చరణ్ 'పెద్ది' చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో, దర్శకుడు బుచ్చిబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి ఆశీస్సుల కోసం వచ్చానని, నేటి రాత్రి 8 గంటలకు చిత్ర ప్రీమియర్ షో పడుతుందని ఆయన తెలిపారు. చిత్రంలో రాంచరణ్‌తో పాటు టీం మొత్తం కష్టపడిందని, శ్రీవారి దయతో చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నట్లు బుచ్చిబాబు సన పేర్కొన్నారు.