మహిళా MLAను హగ్ చేసుకునేందుకు యత్నించిన సీనియర్ నేత.. చివరికి!

కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాం నుంచి గెలిచిన కాంగ్రెస్ నాయకురాలు బిందు కృష్ణని ఆ పార్టీ సీనియర్ నేత చెరియన్ ఫిలిప్ బలవంతంగా హగ్ చేసుకునేందుకు యత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన శాసనసభా పక్ష సమావేశం కోసం బిందు కృష్ణ వచ్చింది. ఈ క్రమంలో MLAను కౌగిలించుకునేందుకు ఆయన ప్రయత్నించగా ఆమె సున్నితంగా పక్కకు తప్పుకున్నారు. చెరియన్ ఫిలిప్ ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

సంబంధిత పోస్ట్