హిజ్రా హత్య కేసులో సంచలన విషయాలు

AP: అనకాపల్లి జిల్లాలో హిజ్రా హత్య కేసు సంచలనం రేపింది. దీపు అనే హిజ్రాను ఆమె ప్రియుడు బన్నీ(దుర్గాప్రసాద్‌) తల, మొండం వేరు చేసి.. కాళ్లు, చేతుల్ని ముక్కలుగా నరికి వేర్వేరు చోట్ల పడేశాడు. ఈ కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు తెలిశాయి. బన్నీకి గంజాయికి అలవాటు ఉందని తెలిసింది. అతనికి తన మరదలితోనూ సంబంధం ఉందని.. ఈ విషయం దీపుకు తెలియడంతో గొడవలు జరిగేవని సమాచారం. దీపు అడ్డుతొలగించుకోడానికే ఈ హత్య చేశాడని పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్