తమిళనాడులో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. విదేశీ పేరు, పౌరసత్వం ఉన్నంత మాత్రాన హిందూ గుర్తింపును నిరాకరించలేమని, హిందూ మతాన్ని స్వీకరించడానికి ఎలాంటి సర్టిఫికెట్లు, ప్రత్యేక వేడుకలు అవసరం లేదని స్పష్టం చేసింది. అమెరికా పౌరురాలు లారా ఫ్రాన్సెస్ అయ్యంగార్‌ను హిందూ భక్తురాలిగానే పరిగణించాలని, తంజావూరు ఆలయంలో హిందూ మహిళలకు ఉండే అన్ని పూజా, దర్శన హక్కులు ఆమెకు కూడా వర్తిస్తాయని ఆదేశించింది. విదేశీయులను అనగానే క్రైస్తవులని అంచనా వేయడం తప్పు అని, మనఃస్ఫూర్తిగా హిందూ జీవన విధానాన్ని పాటిస్తే వారు హిందువులే అవుతారని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.