విద్యార్థులకు వరల్డ్ బెస్ట్ సిటీగా సియోల్

QS బెస్ట్ స్టూడెంట్ సిటీస్- 2026 జాబితాలో దక్షిణ కొరియా రాజధాని సియోల్ ప్రపంచంలో అత్యుత్తమ విద్యార్థి నగరంగా నిలిచింది. గత ఆరేళ్లుగా అగ్రస్థానంలో ఉన్న లండన్ ఈసారి మూడో స్థానానికి పరిమితమైంది. జీవన వ్యయం, ఉపాధి అవకాశాలు, యూనివర్సిటీ ర్యాంకులు వంటి పలు అంశాలపై 150 నగరాలను విశ్లేషించి క్యూఎస్ సంస్థ ఈ జాబితాను విడుదల చేసింది. భారతదేశం నుంచి ముంబయి (98), దిల్లీ (104), బెంగళూరు (108), చెన్నై (128) ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

సంబంధిత పోస్ట్