సీరియల్ నటి మంజులపై మాజీ భర్త కత్తితో దాడి

బెంగళూరులోని సీరియల్ నటి మంజుల అలియాస్ శ్రుతిపై ఆమె మాజీ భర్త కత్తితో దాడి చేశాడు. ఈ నెల 4న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 20 ఏళ్ల క్రితం మంజులకు అమరేష్‌కు వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. గతేడాది వారు ఇద్దరూ విడిపోయారు. ఈ క్రమంలో ఆమె తనను మోసం చేసిందనే కోపంతో మంజుల ముఖంపై పెప్పర్ స్ప్రే కొట్టి, తలను గోడకు కొట్టి, కత్తితో పొడిచాడు. అరుపులు విని స్థానికులు ఆమెను కాపాడారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్