TG: హైదరాబాద్‌లోని పలు OYO హోటల్స్‌లో వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. OYO హోటల్‌కి వెళ్లిన యువతులు అనుమానాస్పద స్థితిలో చనిపోతున్నారు. SEP 21 మాదాపూర్ ఓయోలో షారోన్ నిఖిత, సెప్టెంబర్ 29న SR నగర్ ఓయో హోటల్లో బి.శిరీష, OCT 2న మియాపూర్ హోటల్లో వైద్య విద్యార్థి కోమటి సృజన చనిపోయారు. ఈ ఘటననలు OYO హోటళ్లలో భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అతిథుల వివరాల వెరిఫికేషన్‌పై పోలీసుల నిఘా ఉందా? సీసీ కెమెరాల నిర్వహణపై పర్యవేక్షణ ఉందా? అనుమానాస్పద కదలికలపై హోటల్ యాజమాన్యాలు పోలీసులకు సమాచారం ఇస్తున్నాయా? వరుస ఘటనల నేపథ్యంలో హోటళ్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారా?' అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.