OYOలో యువతుల వరుస హత్యలు.. 10 రోజుల్లో ముగ్గురు హతం!

TG: హైదరాబాద్‌లోని OYO హోటళ్లలో యువతుల వరుస హత్య ఘటనలు కలకలం రేపుతున్నాయి. సెప్టెంబర్ 21న మాదాపూర్ పరిధిలోని ఓ OYO హోటల్‌కు వెళ్లిన వైజాగ్‌కు చెందిన షారోన్ నిఖిత అనే యువతి దారుణ హత్యకు గురైంది. SEP 29న SR నగర్ ప్రాంతంలోని OYO హోటల్‌లో VKBకు చెందిన శిరీష అనే మహిళ కూడా చనిపోయి కనిపించింది. అలాగే అక్టోబర్ 2న హన్మకొండకు చెందిన వైద్య విద్యార్థిని K. సృజన అనే యువతి మియాపూర్‌లోని ఓ హోటల్‌లో ప్రాణాలు కోల్పోయింది. ఇలా పది రోజుల వ్యవధిలోనే ముగ్గురు యువతులు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు నగర ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕