జాతీయ రహదారిపై మూడు బస్సులు, డీసీఎం ఢీ.. తప్పిన పెను ప్రమాదం

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రాయిపల్లి (ఢీ) క్రాస్ వద్ద జాతీయ రహదారి 65 పై మూడు బస్సులు, ఒక డీసీఎం వాహనం ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. జహీరాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద స్థలానికి చేరుకున్న జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వారు అధికారులను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్