హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో ఉన్న అటల్ టన్నెల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో వెళ్తున్న ఒక టెంపో, ఎదురుగా వస్తున్న మరో టెంపో ట్రావెలర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి టెంపో డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. ఈ ఘటనలో నలుగురు పర్యాటకులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా అటల్ టన్నెల్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.