అక్రమంగా ఉంటున్న ఏడుగురు బంగ్లాదేశ్‌ పౌరులు అరెస్ట్‌

TG: హైదరాబాద్‌ జీడిమెట్లలో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశ్‌ పౌరులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరికి పాస్‌పోర్టు, వీసా సహా ఎలాంటి చెల్లుబాటు పత్రాలు లేవని, అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి నివసిస్తున్నట్లు విచారణలో గుర్తించారు. ఓ అద్దె ఇంట్లో తనిఖీలు చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకుని జోగిపేటలోని డిపోర్టేషన్ కేంద్రానికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్