TG: సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట మండలంలో దసరా పండగ రోజు 15 ఏళ్ల బాలికపై ఏడుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్ళిన సమయంలో నిందితులు బాలికను బలవంతంగా తీసుకెళ్లి అఘాయిత్యం చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు గురువారం రంగంలోకి దిగిన పోలీసులు, ముగ్గురు మైనర్లతో సహా ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.