ఉత్తరాఖండ్‌లో మంచు చరియలు విరిగిపడి పలువురు మంచు కింద చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. మంచు కింద చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి రెస్క్యూ టీం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు 47 మందిని రక్షించగా మృతుల సంఖ్య ఏడుగురికి చేరుకుంది. దాదాపు ఏడు అడుగుల మేర మంచు పేరుకుపోవడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు కలుగుతున్నాయి.