రెస్క్యూ హోం నుంచి పరారైన ఏడుగురు మహిళలు

TG: జగద్గిరిగుట్టలోని ఆల్విన్ కాలనీ రెస్క్యూ హోం నుంచి ఆదివారం రాత్రి ఏడుగురు మహిళలు తప్పించుకున్నారు. పీటా కేసుల్లో పునరావాసం పొందుతున్న 9 మందిలో, నీటి ట్యాంకర్ కోసం గేట్లు తెరిచిన సమయంలో వీరు పారిపోయారు. సిబ్బంది ఇద్దరిని పట్టుకున్నా, మిగిలిన ఏడుగురు తప్పించుకున్నారు. వీరిలో తెలంగాణకు చెందిన ముగ్గురు, ఏపీ, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, కెన్యా దేశాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రెస్క్యూ హోం అధికారుల ఫిర్యాదుతో జగద్గిరిగుట్ట పోలీసులు పరారైన వారి కోసం గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్