7ఏళ్ల బాలికను చంపి డ్రమ్ములో పడేసిన నిందితుడు.. ఎన్‌కౌంటర్‌లో హతం

ఆగ్రాలో ఏడేళ్ల బాలిక అపహరణ, హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. రూ. 25,000 రివార్డు ఉన్న నిందితుడు సునీల్, పోలీసుల ఎదురుకాల్పుల్లో మరణించాడు. మార్చి 24న బాలిక అదృశ్యం కాగా, మార్చి 25న అద్దె ఇంట్లోని పిండి డ్రమ్ములో మృతదేహం లభ్యమైంది. మార్చి 27-28 రాత్రి, పోలీసులపై కాల్పులు జరిపిన నిందితుడు, ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో గాయపడి, ఆసుపత్రిలో మరణించాడు. సంఘటనా స్థలం నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్