TG: మహబూబ్నగర్ జిల్లా ధన్వాడ మండల కేంద్రంలోని మోడల్ ఆదర్శ హాస్టల్లో శనివారం పలువురు బాలికలు టిఫిన్ చేసిన అనంతరం అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాలతో బాధపడిన బాలికలను వెంటనే ధన్వాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వీరిలో ఏడుగురు బాలికలను మెరుగైన వైద్యం కోసం నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆహారం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు వంటగదిని పరిశీలించి, ఆహార నమూనాలను పరిశీలిస్తున్నారు.