TG: రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు నేతలు ఆయన సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అనంతరం KTR మాట్లాడుతూ.. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే పార్టీ మారినా క్యాడర్ బీఆర్ఎస్తోనే ఉందని, కాంగ్రెస్ వచ్చి మూడేళ్లు అయినా కొందరికి నిద్రపట్టడం లేదని అన్నారు. పోలీసులు కేసీఆర్ పాటలు పెట్టొద్దని చెప్పినా, కేసీఆర్పై ప్రజల అభిమానం తగ్గలేదని, మళ్లీ ఆయన ఎప్పుడు వస్తారని ప్రజలు అడుగుతున్నారని తెలిపారు.