TG: రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. ఈ సీజన్‌లో తొలిసారిగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా సత్వార్‌లో 9.6 డిగ్రీలు, కోహీర్‌లో 9.7, న్యాల్‌కల్, ఝరాసంగంలో 10 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా డోంగ్లిలో 10.5 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా బషీరాబాద్, ధారూర్‌లో 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.