బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా 2 రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, మంచిర్యాల, కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడతాయని తెలిపింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.