తీవ్ర వాయుగుండం.. పోర్టుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ

తెలుగు రాష్ట్రాలను తీవ్ర వాయుగుండం వణికిస్తోంది. ఇవాళ, రేపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేయబడింది. ఈరోజు అర్ధరాత్రి వాయుగుండం తీరం దాటనుంది. నిన్న రాత్రి 11.30 గంటలకు విశాఖకు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వాయుగుండం, గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. కళింగపట్నం సమీపంలో తీరం దాటనున్నట్లు సమాచారం. తీరం వెంబడి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఈ వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕