ముస్లిం పర్సనల్ లా ప్రకారం 18 ఏళ్లలోపు బాలికను వివాహం చేసుకున్నప్పటికీ.. ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోవడం నేరమేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలతో భర్తపై పోక్సో, బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేయవచ్చని తెలిపింది. ఈ మేరకు 16 ఏళ్ల బాలికను వివాహం చేసుకున్న 28 ఏళ్ల వ్యక్తిపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలన్న పిటిషన్‌ను జస్టిస్ సంజీవ్ నారులా తిరస్కరించారు. కుటుంబాల సమ్మతితో వివాహం జరిగినా.. మైనర్‌తో లైంగిక సంబంధం క్రిమినల్ చర్యగానే పరిగణించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది.