మేడారం జాతరలో బాలికపై లైంగిక దాడి!.. ఘటనపై విచారణ కమిటీ

TG: మేడారం జాతరలో బాలిక(13)పై లైంగిక దాడి జరిగినట్లు మీడియాలో వచ్చిన కథనాలపై జాతీయ మహిళా సంఘం స్పందించింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి.. మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ విజయ రహాత్కార్‌ విచారణ కోసం కమిటీని ఏర్పాటు చేశారు. నేటి నుంచి ఈ కమిటీ విచారణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐదుగురు యువకులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ కమిటీ విచారించనుందని మహిళా కమిషన్‌ ప్రకటన విడుదల చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్