TG: రాష్ట్రంలో టీనేజీ అమ్మాయిల ప్రెగ్నెన్సీ ఘటనలు పెరుగుతున్నాయి. కొందరు మాయ మాటలతో, ప్రేమ పేరుతో లొంగదీసుకుని ప్రెగ్రెన్సీలకు కారమవుతున్నారు. ఆ తర్వాత మొఖం చాటేస్తున్నారు. మరి కొందరు బెదరింపులకు పాల్పడి అబార్షన్లు చేయిస్తున్నారు. బాధిత అమ్మాయిలు కూడా ఇంట్లో చెబితే తమనే నిందిస్తారని మౌనంగా ఉండిపోతున్నారు. మరికొందరు రహస్యంగా ప్రసవించి, పుట్టిన బిడ్డలను చెత్త కుప్పల్లో లేదా ముళ్ల పొదల్లో వదిలేస్తున్నారు. ఇటీవల గోల్కొండ సమీపంలోని మైనారిటీ హాస్టల్లో ఇంటర్మీడియట్ విద్యార్థిని బిడ్డకు జన్మనిచ్చింది. విషయం బయటపడకుండా ఆ పసికందును భవనం పైనుంచి కిందకు విసిరేసింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పలు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.