లైంగిక వేధింపుల కేసు.. మాజీ సీఎం యడియూరప్పకు సమన్లు

లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు ఫాస్ట్రాక్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆయన ఒక మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరులోని ఆయన నివాసంలో జరిగిన సమావేశంలో తన 17 ఏళ్ల కుమార్తెపై యడియూరప్పతో పాటు మరో ముగ్గురు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో వారిపై పోక్సో కేసు నమోదైంది. ఈ క్రమంలోనే యడియూరప్ప సహా నలుగురు DEC 2లోపు తమ ఎదుట హాజరుకావాలంటూ కోర్టు సమన్లు ఇచ్చింది.

సంబంధిత పోస్ట్