AP: కాకినాడ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పిఠాపురంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో బాలికపై టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ప్రసన్న కుమార్ అనే బాలికపై స్కూల్ టీచర్ లైంగికంగా వేధించాడు. దాంతో ఆగ్రహించిన బాధితురాలి తల్లిదండ్రులు స్కూల్ వద్ద ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పిఠాపురం ఎస్ఐ మణికుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.