పాకిస్థాన్ - దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. దక్షిణాఫ్రికా బౌలర్ మార్కో జాన్సెన్ వేసిన బంతి పాకిస్థాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ వికెట్‌ను తాకినా బెయిల్స్ కిందపడకపోవడంతో షఫీక్ నాటౌట్‌గా బయటపడ్డాడు. డీఆర్‌ఎస్ రివ్యూలోనూ బంతి వికెట్‌ను తాకినట్లు స్పష్టంగా కనిపించినా క్రికెట్ నిబంధనల ప్రకారం బెయిల్స్ కిందపడకపోవడంతో అంపైర్ నాటౌట్‌గా ప్రకటించారు.