భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు వేగంగా పరుగుల వేట సాగిస్తున్నారు. అలీ రజా వేసిన 37వ ఓవర్‌లో భారత బ్యాటర్ షాబాజ్ అహ్మద్ రెండు భారీ సిక్సర్లు బాదాడు. ఈ ఓవర్‌లో మొత్తం 14 పరుగులు వచ్చాయి. 37 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 199/6 స్కోరుతో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో తిలక్ వర్మ 53 పరుగులతో, షాబాజ్ అహ్మద్ 43 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తూ జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్తున్నారు.