టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ తన భవిష్యత్తు ప్రణాళికలపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇకపై వచ్చే ప్రపంచకప్‌ల గురించి ఆలోచించడం లేదని, ప్రస్తుతం ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి బెంగాల్ జట్టు, ఐపీఎల్‌లో ఆడటమే తన ప్రాధాన్యత అని చెప్పాడు. నవంబర్ 6న టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన షమీ, శారీరక ఒత్తిడిని తగ్గించుకుని వైట్‌బాల్ క్రికెట్‌ను స్వేచ్ఛగా ఆడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. జాతీయ జట్టు పునరాగమనం గురించి సెలక్టర్ల నిర్ణయానికే వదిలేస్తున్నానని స్పష్టం చేశాడు.