జ్యోతిష్యశాస్త్రంలో శని త్రయోదశి, మాసశివరాత్రి యోగానికి విశేష ప్రాధాన్యత ఉంది. శనివారం త్రయోదశి రావడం అరుదైన యోగంగా పరిగణిస్తారు. ఈ పవిత్ర సందర్భంగా శని, పరమశివుని అనుగ్రహం లభిస్తుందని, ఏలినాటి శని వంటి దోషాల నివారణకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దానధర్మాలు చేయడం శుభప్రదమని పండితులు సూచిస్తున్నారు. నక్త వ్రతం, మౌన వ్రతం పాటించడం, 33 మారేడు దళాలతో శివారాధన చేయడం వంటివి విశేష ఫలితాలనిస్తాయని విశ్వసిస్తున్నారు.